Dashboard
bookId volumeNo cantoNo chapterNo subChapterNo sectionNo subSectionNo uvacha contentId contentType content translation lastUpdateOn lastUpdateDesc
0 0 0 1 0 1 0 1 meaning “శబ్దబ్రహ్మయై – వాక్కులకు ఛ౦దోగణాలకూ అధిపతి – ‘గణపతి’ స్వరూపియైన ‘బ్రహ్మనస్పతి’కి భక్తిపూర్వక నమస్కారము! సమస్త కార్యములకూ విఘ్నభయం నివారించే “విఘ్నపతి”కి నమస్కారము. మాకు సమస్త సంపదలనూ ఇచ్చే “లక్ష్మిగణపతి”కి, లక్షని కటాక్షించే మహా గజమునకు నమస్సులు! ‘సిద్ధి’-ని కలిగించే యోగ జ్ఞానస్వరూపమైన ‘బుద్ధీ’శునకు నమస్సులు. సమస్త దేవతాగణములకూ ప్రథముడైనవాడూ – ‘అక్షర’, భీజాక్షర, మంత్రరూపదేవతా గణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ‘ఓంకార’ స్వరూపియైన “గణనాథున”కు నమస్సులు!”
0 0 0 1 0 1 0 2 meaning “ఓ బ్రహ్మరూపీ! జ్ఞానప్రదుడవు! ఓ విష్ణురూపీ సంపత్ర్పదుడవు! ఓ రుద్రరూపీ ‘కర్మ’లను భస్మంచేసే వైరాగ్య స్వరూపుడవు! నీవే పరబ్రహ్మవు! సమస్త వేదరాశికీ అక్షరరూపియైన ఓ ఛ౦దస్వరుడా! నీకివే నా నమోవాకములు! ప్రసన్నుడవుకమ్ము!”
0 0 0 1 0 2 0 3 meaning బ్రహ్మవిద్యాప్రదాయకుడైనటువంటి గణేశునకు నమస్కారము. విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషివలే శోశింపచేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను.
0 0 0 1 0 2 0 4 meaning పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు లోకకళ్యాణార్థం పన్నెండు సంవత్సరాలపాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజూ సాయంసమయంలో సత్కధాశ్రవణం చేసేవారు! ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహమునితో ఇలా అన్నారు.
0 0 0 1 0 2 0 5 meaning “ఓ సూతమహాముని! నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు! సకల విద్యలకూ నిధివైన నీవంటి వక్త లభించటం జన్మజన్మంతరములలో చేసిన మహాపుణ్యం వలనగానీ జరగదు! మేమంతా అటువంటి నీ దర్శనమాత్రం చేత ధన్యులమైనాము! మా మనస్సులను పవనమోనరించే భాగవత్కథలను నీనుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము. కనుక అట్టి పరమ కమనీయములూ, పవనకరములూ మంగళమయములైన భాగవత్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది!”
0 0 0 1 0 2 0 6 meaning అమోఘ తపస్సంపన్నులూ, నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడిలా బదులిచ్చాడు.
0 0 0 1 0 2 0 7 meaning “ఓ పరమపావనులైన మునిసత్తములారా! పావనమైన మీయొక్క ప్రశ్న సకల లోకాలకూ ఉపకరించేదీ, నన్నూ తరింపచేసేదీను! కనుక మీరు కోరినవిధ౦గా సత్కధా కాలక్షేపం చేయాలని నాకూ ఉత్సాహంగానే ఉన్నది!
0 0 0 1 0 2 0 8 meaning “ఓ పావనులారా! మద్గురువరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలనూ, అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆసాంతం నేర్చుకున్నాను. వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పతగిన శ్రీగణేశపురాణాన్ని మీకు వినిపిస్తాను. ఈ పురాణంయొక్క విశేషమేమిటంటే ఇది అంతతేలికగా లభించేదికాదు! ఈ గాణేశుడిని స్మరణమాత్రంచేతనే విఘ్నములనే మంచుతెరలు ఆయన అనుగ్రహమనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. విఘ్నపతి‍ భక్తులకు తమ మనోభీష్టసిద్ధీ, సకలకార్యసిద్ధీ కలుగుతుంది.
0 0 0 1 0 2 0 9 meaning ఎన్నో జన్మజన్మాంతరాల పుణ్యంవల్లనే ఇటువంటి కధాప్రసంగం వినడం, చెప్పడం లభిస్తుంది. ఐతే నాస్తికులైనవారూ, శ్రద్ధారహితులూ ఎంతమాత్రం ఈ పురాణశ్రవణానికి అర్హులుకారు! ఈ గజాననుడు భక్తవత్సలుడు! అనంత మహిమోపేతుడు! నిత్యసత్య స్వరూపుడు. ఈయన నిర్గుణతత్వ్తంగానూ, సగుణమూర్తిగాకూడా ఆరాధించబడుతున్నాడు. సకల వేదాలకూ, మంత్రాలకూ ఆదిలో వెలువడిన ప్రణవస్వరూపుడే గజాననుడు.
0 0 0 1 0 2 0 10 meaning ఈ వినాయకుని అట్టి ప్రణవస్వరూపునిగానే ఇంద్రాది సకల దేవతలూ తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈతడే అఖిల జగములకూ కారణమైనటువంటివాడు. ఆదిమధ్యాంతరహితుడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమతమ కార్యభారాన్ని (సృష్టి స్థితి లయలను) ఈ గణేశుని అనుజ్ఞమేరకే నిర్వర్తిస్తున్నారు. ఈయన ఆజ్ఞవల్లనే వాయువు వీస్తున్నాడు, అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు, జలములూ ప్రవహిస్తున్నాయి! అట్టి సర్వేశ్వరుడు సకల జగన్నియామకుడైన గణేశుని చరిత్రను మీకు తెలియచేస్తాను. ఎంతో రహస్యమైనటువంటిదీ, అమోఘమైనట్టి ఈ పావనచరితాన్నిభక్తిశ్రద్ధలతో ఆలకించండి!
0 0 0 1 0 2 0 11 meaning ఈ గణేశపురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాసమహర్షికి ఉపదేశించాడు. ఆయన భ్రుగువుకూ, ఆ భ్రుగుమహర్షి తరువాతికాలంలో సోమకాంతమహారాజుకు ఉపదేశించారు.
0 0 0 1 0 2 0 12 meaning ఈ పురాణాన్ని భ్రుగుమహర్షికీ సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను. సావధనమనస్కులై ఆలకించండి!
0 0 0 1 0 3 0 13 meaning పూర్వం సౌరాష్ట్రదేశంలో దేవనగరమనే రాజ్యం ఉండేది! ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై, జనరంజకంగానూ, ధర్మబద్ధ౦గానూ ప్రజలను కన్నబిడ్డలవలే ప్రేమగా పాలించేవాడు. సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా – సార్ధక నామదేయుడిగా (చంద్రుని వెన్నెలవంటి శరీరకాంతి కలిగి) ప్రకాశించేవాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయడంవల్ల అతడి రాజ్యం సుభిక్షంగా, సస్యశ్యామలమై, ధనదాన్యాలతోనూ పాడిపంటలతోనూ అలరారుతూ, శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది!
0 0 0 1 0 3 0 14 meaning ఈరాజుగారి కొలువులో నీతికోవిదులు, సకల శాస్త్రపారంగతులూ, ప్రభుభక్తి పరాయణులూ ఐన ఐదుగురు మంత్రులు౦డేవారు. వారు రాజుకు సరైన సలహాలనిస్తూ, వ్యూహరచనచేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూండేవారు! సోమకాంతుడు తన భుజపరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారినుంచి కప్పము తీసుకునేవాడు. ఆమంత్రులు వరుసగా 1) రూపవంతుడు, 2) విద్యాధీశుడు, 3) క్షేమంకరుడు, 4) జ్ఞానగమ్యుడు, 5) సుబలుడు అన్నపేర్లతో పిలువబడేవారు.
0 0 0 1 0 3 0 15 meaning ఆరాజుకు సుధర్మ అనే భార్య ఉండేది. అమిత సౌందర్యవతి, సకలసద్గుణ సంపన్నయైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వఅలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది.
0 0 0 1 0 3 0 16 meaning ఆ పుణ్యదంపతులకు అమిత బలపరాక్రమోపేతుడూ, గుణవంతుడూ బుద్ధిశాలియైన హెమక౦ఠుడనే కుమారుడుండేవాడు. ఇలా సకల సిరిసంపదలతో, కీర్తిప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోకకళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ, దాతయై తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు.
0 0 0 2 0 0 0 సూతమహర్షి 17 meaning సూతమహర్షి ఇలా కొనసాగించాడు: “ఇలా సోమకాంతమహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకంవల్ల అతిదారుణమైన కుష్టువ్యాధి సంక్రమించింది. శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి, సోమకాంత మహారాజు, ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు!
0 0 0 2 0 0 0 18 meaning కాని, నానాటికీ అతని ఆరోగ్యపరిస్థితి క్షీణించసాగింది. శరీరమంతా రసిఓడుతూ దుర్గంధభూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఎముకలగూడు వంటి శరీరంమాత్రం శేషమాత్రంగా మిగిలింది. అప్పుడు ఆరాజు మంత్రులను ఒకనాడు తనవద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు.
0 0 0 2 0 0 0 19 meaning “ఓ అమాత్యులారా! నా శరీరారోగ్యం నానాటికీ క్షీణిస్తున్నది! ఈజన్మలో నాకు తెలిసినంతవరకూ అన్నీ సత్కార్యాలనే చేశాను. సాధు సజ్జనులసేవ, ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్యపరిపాలననూ ఏ మాత్రం ఏమరుపటులేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను! బహుశ ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు. దుర్గంధభూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలచుకోలేదు. నా అనంతరం నా కుమారుడైన హేమక౦ఠుని రాజ్యాభిషిక్తునిగాచేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి!
0 0 0 2 0 0 0 20 meaning మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలెనని నిశ్చయించాను. సర్వసంపదలనూ పరిత్యజించి జీవితపరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను.”
0 0 0 2 0 0 0 21 meaning ఈ వాక్యం పూర్తిచేసి శరీరబాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు. అప్పుడు శైత్యోపచారములతోనూ, మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి, మంత్రులు ఆరాజుతో యిలా అన్నారు.
0 0 0 2 0 0 0 22 meaning “ఓ మహారాజా! నీ దయకు అనుగ్రహానికీ పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలనూ నీవల్ల, అనుభవించాము. ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీరబాధను అనుభవిస్తూoటే కృతఘ్నుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు. మీ అభీష్టంమేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి, మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము! అందుకు అనుమతించండి!” అంటూ వేడుకున్నారు.
0 0 0 2 0 0 0 సుధర్మ 23 meaning అప్పుడు ఆరాజు భార్యయైన రాణీ సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది. “ఓ మంత్రిపుంగవులారా! నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికెళతాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి! అదే మీకూ, నాకూ – ఉభాయతారకము”
0 0 0 2 0 0 0 హేమక౦ఠుడు 24 meaning అలాగే కుమారుడైన హేమక౦ఠుడు కూడా :- “తండ్రీ! మీ సేవకన్నా నేను ఇంక కోరుకునేదేమీలేదు! ఈ రాజ్యము, ధనమూ వీటివల్ల నాకేమీ ప్రయోజనంలేదు. మిమ్మల్నే అనుసరించి వచ్చి మీసేవలో తరిస్తాను” అన్నాడు.
0 0 0 2 0 0 0 సోమకాంతుడు 25 meaning అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుని చేరబిలిచి “నాయనా! కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలనచేయటం, శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాదికములు చేయటమూ, గయలో పిండప్రదానము చేయడమూ ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!
0 0 0 2 0 0 0 26 meaning కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు! ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం! నేను ఒక్కడినే భార్యాసహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను!” అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచనా మందిరంలోకి వెళ్ళి అతనికి నానావిధములైన ఆచార వ్యవహారములనూ రాజనీతి రహస్యములనూ ఇలా ఉపదేశించసాగాడు.
0 0 0 3 0 1 0 27 meaning అలా రహస్యమందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమక౦ఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గాసింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనంపైన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసంకలిగేలా తన కుడిచేతిని ఉంచి అతనితో యిలా అన్నాడు.
0 0 0 3 0 1 0 సోమకాంతుడు 28 meaning “కుమారా! అనేకవిధములైన ధర్మాలన్నింటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది. రాజైనవాడు దీనిని తప్పక పాటించాలి! అందువల్లనే ఆయువూ, ఆరోగ్యమూ, కీర్తీ వర్ధిల్లుతాయి. దేవతనుగ్రహమూ, వంశాభివృధ్ధీ కూడా కలుగుతాయి. ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను!”
0 0 0 3 0 2 0 29 meaning అర్థరాత్రి ఇంకా యామం (షుమారు రెండున్నర గంటలు) కాలం వుoడగానే సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీముహుర్తంలోనే నిద్ర లేవాలి! వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచియైన స్థానంలో కూర్చుని తన ఆచార్యుని (గురువును), దేవతలనూ, ప్రణవం (ఓంకార) సహితంగా భూమాతను ధ్యానించాలి. భూమిపై పాదాలు౦చుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి, ఆ తరువాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై, సకల ఆగమములచేతా కొనియాడబడుతున్నవాడూ, చతుర్విధపురుషార్థములను ప్రసాదించేవాడూ వాక్కులకూ, మనస్సుకూ అతీతుడూ ఐన గజాననునికి నమస్కరించాలి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనూ స్మరించి, మానసోపచారముల పూజచేసి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటిపాత్రను తీసుకుని గ్రామానికి నైఋతిదిక్కుగా వెళ్ళాలి. బ్రాహ్మనుడైనవాడూ, క్షత్రీయుడూ ఎఱ్ఱటి ఒండ్రుమట్టినీ, వైశ్యశూద్రులు నల్లటి ఒండ్రుమట్టిని తీసుకుని నదీతీరములో బ్రాహ్మణగృహాలూ, పుట్టలూవున్న ప్రదేశాలను విడచి – దూరంగా ఉన్న శౌచవిధులను నిర్వర్తించాలి.
0 0 0 3 0 2 0 30 meaning దివారాత్రములలో ఉత్తర-దక్షిణ దిశలుగా మూత్రపురీష విసర్జన చేయాలి. ఆ తరువాత ఐదుసార్లు మట్టితో, నీటితో చేతులు కడుక్కోవాలి. పదిసార్లు ఎడమచేతిని, ఆ తరువాత మరో ఏడుసార్లు రెండు చేతులనూ, ఒక్కసారి మట్టితో పాదములనూ శుద్ధిచేసుకోవాలి! వ్రతం ఆచరించేవాడు ఇందుకు రెండురెట్లూ, వానప్రస్థుడైనవాడు మూడురెట్లు, సన్యాసులు నాల్గురెట్లూ శుద్ధిచేసుకోవాలి! స్త్రీలు, శూద్రులు ఇందులో సగము, పాతికవంతు మాత్రం శుద్ధిచేసుకుంటే చాలు.
0 0 0 3 0 2 0 31 meaning ఆ తరువాత శుద్ధాచమనంచేసి గానుగ, వేప వంటి పుల్లలను ప్రార్థనాపూర్వకంగా (ఓ వృక్షమా! బలాన్నీ, ఓజస్సునూ, తేజస్సునూ, బుద్ధినీ, సంపదలను ప్రసాదించవలసింది) అని ప్రార్థించి వాటిని సేకరించి దంతధావన (పళ్ళు తోముకోవాలి) చేయాలి.
0 0 0 3 0 2 0 32 meaning ఆ తరువాత నదీ లేక చెరువులో ‘అపవిత్రః పవిత్రోవా’ అన్న మంత్రంతో మలాపకర్షణ స్నానాన్నీ, ఆతరువాత మంత్రపూరితంగా అఘమర్షణస్నాన “అపోహిష్టానాన్ని మయోభువ” ఇత్యాది మంత్రాలతో చేసి, సంధ్యావందనాదికాలను నిర్వర్తించాలి! ఏకాగ్రచిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక, గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి! హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్రదేవతా తర్పణాన్నీ, స్వాధ్యాయనమూ (వేద శాస్త్రగ్రంధాల అధ్యయనం) చేయాలి! దేవతాపూజలు చేశాక వైశ్వదేవమిచ్చి, బ్రాహ్మణులనూ అతిధులనూ కూడి భుజించాలి!
0 0 0 3 0 2 0 33 meaning ఆతరువాత పురాణశ్రవణం చేయాలి! రాజైనవాడు ‘అభక్ష్యభక్షణం’ (తినకూడనివి తినడం), ఇతరులను నిందించడం మనాలి! ఇతరులకు ఉపకారం చేయడానికే తన మాటనూ, ద్రవ్యాన్నీ, శక్తియుక్తులనూ వినియోగించాలి. దానధర్మాలు తప్పక ఆచరించాలి! తన భార్యను విసర్జించడం, ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవడం కూడా దోషమే! పరదారలపట్ల దోష-బుద్ధి కూడదు!
0 0 0 3 0 2 0 34 meaning మాతాపితరుల సేవ, గో, బ్రాహ్మణుల సేవ గురుశుశ్రూష అవశ్యం ఆచరించాలి! దీనులైనవారికి అన్నవస్త్రాలనిచ్చి ఆదరించాలి! సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. ప్రాణం పోయినా సత్యవచనాన్ని మాత్రం వీడకూడదు! సాదుసత్పరుల సేవాఫలితం అనంతమైనది. దానివల్ల భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రద్ధా, భక్తులతోనూ అనన్యమనస్సుతోనూ వారిని సేవించాలి.
0 0 0 3 0 2 0 35 meaning ఇక రాజ్యపాలన విషయంలో రాజెప్పుడూ ఏమరుపాటు చెందకూడదు. దోషులను అపరాధనుసారమే నిష్పక్షపాతంగా దండించాలి. తనయందు విశ్వసపాత్రులుగాని వారిని విశ్వసించకూడదు. ఒకప్పుడు శత్రువుగా ఉండినవాడిని కూడా గ్రుడ్డిగా విశ్వసించడం దగ్గరగా మసలనీయడం చేయకూడదు. అలాగే తన శక్త్యానుసారం దానములు చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడౌతాడు. సమర్థవంతమైన పాలనకై గూఢచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై వు౦డాలి. సరియైన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు. అలా జరగనప్పుడు రాజ్యంలో అరాజకత్వం చెలరేగుతుంది. రాజైనవాడు బహిశ్శత్రువులతో పాటు తన అంతశ్శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరింటినీ జయించాలి. వృత్తిచ్చేదము, సంతానచ్చేదము, దేవతాచ్చేదము కూడనివి! ఆరామములను, నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు! సర్వ కాలములలో దానధర్మములు విరివిగా చేయాలి. త్యాగబుద్ధి గలిగి ప్రజలకు ఆదర్శప్రాయుడై జీవించాలి.
0 0 0 3 0 2 0 36 meaning మిత్రద్రోహమూ, స్త్రీలకు రహస్యాలు చెప్పడం ఎన్నడూ చేయకూడని పనులు! తాను ప్రసన్నతతో, సహృదయతతో ప్రజానీకము యొక్కా భృత్యులయొక్కా అభిమానాన్ని ఆదరాన్ని చూరగొనాలి! బ్రాహ్మణులను ఋణ విముక్తుల్ని చేయడం, గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి. ఎల్లవేళలా దేవబ్రాహ్మణ పూజలు చేయటం ధర్మజ్ఞుడైన రాజు ఆచరించాల్సిన ధర్మములు” అంటూ ఇంకా అనేక యితర రాజనీతులను, ధర్మ సూక్ష్మాలనూ సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమక౦ఠునకు ఉపదేశించాడు.
0 0 0 3 0 2 0 37 meaning ఆ తరువాత ఒక శుభాముహుర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకలసంబారములతోనూ సమస్త రాజలా౦ఛనాలతోనూ ఎల్ల రాజలోకమూ, పురప్రముఖులూ చూస్తుండగా – పూజించి, నిర్విఘ్నతకై గణపతిని, ఇష్టదేవతారాధనను సల్పి సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణోత్తముల మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు.
0 0 0 3 0 2 0 38 meaning మంత్రులతో “ఓ అమాత్యవరులారా! ఇతడు నా కుమారుడూ, వారసుడూను! మీరంతా నాయందు చూపినట్లే అభిమానాన్ని, అనురాగాన్నీ, యితనికి పంచివ్వండి! నా ఆజ్ఞవలెనే ఇతని ఆజ్ఞను కూడా మీరూ, మీతోపాటూ మన రాజ్యంలో అందరూ నిర్వర్తించవలసింది!” అని ఆదేశించి, తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు. అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులనూ, దానధర్మాలతో సమస్త ప్రజలనూ సంతృప్తిపరిచాడు సోమకాంతమహారాజు.